PM CARES Fund: పీఎం–కేర్స్ నిధి నుంచి రూ.10లక్షలు
Sakshi Education
PM CARES Fund: పీఎం–కేర్స్ నిధి నుంచి ఎంత మొత్తాన్ని సాయంగా అందించనున్నారు?
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు 23ఏళ్లు వచ్చేసరికి పీఎం–కేర్స్ నిధి నుంచి రూ.10లక్షల మొత్తం సాయంగా అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం–కేర్స్ ఫర్ చిల్డ్రన్ ఇనీషియేటీవ్ పథకాన్ని మే 29, 2021న ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పిల్లలకు పాఠశాలల్లో చదువుకొనే సమయంలో రూ.20,000 స్కాలర్‌షిప్, ప్రతినెలా రూ.4,000 ఖర్చుల నిమిత్తం అందించనున్నారు. ఈ పథకం కింద పిల్లలు ఉన్నత విద్యాభ్యాసానికి రుణాలు తీసుకొనేందుకు కూడా అర్హులు. దీంతోపాటు ఈ చిన్నారులకు రూ.5లక్షల విలువైన హెల్త్‌కవరేజీ లభించేలా ఆయుష్మాన్ కార్డులను కూడా అందజేయనున్నారు. 2020 మార్చి 11 నుంచి 2022 ఫిబ్రవరి 28లోపు కరోనా కారణంగా తల్లిదండులు ఇద్దర్నీ లేదా ఒకరిని, చట్టపరమైన సంరక్షకులను, దత్తత తీసుకొన్న పేరెంట్స్‌ను కోల్పోయిన వారికి ఈ పథకం వర్తిస్తుంది.
Published date : 07 Jun 2022 05:19PM