Bihar Minister List 2022 : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంత్రివర్గం ఇదే..
Sakshi Education
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 31 మందితో మంత్రివర్గాన్ని విస్తరించారు. మహా ఘట్‌బంధన్‌లో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీకి 16, జేడీ(యూ)కు 11 పదవులు, కాంగ్రెస్‌కు 2, హెచ్‌ఏఎంకు, స్వతంత్రునికి ఒకటి దక్కాయి.
కొత్త మంత్రులతో గవర్నర్ పగు చౌహాన్ ఆగస్టు 16వ తేదీన (మంగళవారం) ప్రమాణస్వీకారం చేయించారు. బీసీలకు 17, అగ్రవర్ణాలకు 6, ముస్లింలు, దళితులకు ఐదేసి పదవులు దక్కాయి. కొత్త మంత్రుల్లో 8 మంది యాదవులున్నారు. ముగ్గురు మహిళలకు అవకాశమిచ్చారు. నితీశ్ ఇటీవలే ఎన్డీఏతో బంధం తెంచుకుని మహా ఘట్‌బంధన్‌తో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కీలకమైన హోం శాఖను నితీశ్ తన వద్దే ఉంచుకున్నారు. తేజస్వికి ఆరోగ్యం, రోడ్డు రవాణా తదితర శాఖలు దక్కాయి. వివాదాస్పదునిగా పేరుబడ్డ ఆయన సోదరుడు, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్‌ప్రతాప్‌కు అటవీ, పర్యావరణ శాఖ దక్కింది. మహా ఘట్‌బంధన్‌కు వామపక్షాలు బయటి నుంచి మద్దతిస్తున్నాయి.
Published date : 17 Aug 2022 06:37PM