Population: 2050 నాటికి ఎంత శాతం జనాభా పట్టణాల్లో ఉంటారని అంచనా?
పల్లె జనం పట్టణ బాట పడుతున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళ్తున్నారు. దీంతో దేశంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల (హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్) మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ‘‘2021–22 వార్షిక నివేదిక’’ను నివేదికను విడుదల చేసింది. నివేదికలోని అంశాలు ఇలా..
Mahindra Holidays: చైనా వాల్ తర్వాత అత్యంత పొడవైన గోడ ఎక్కడ ఉంది?
పేదరికం తగ్గుతుందనడానికి ఇదో సూచన..
- గ్రామాల్లో విద్యా సౌకర్యాలు మెరుగుపడుతుండటంతో చదువుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారంతా ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు.
- చదువుకోని వారు కూడా ఉపాధిని వెదుక్కుంటూ పట్టణాలకు చేరుతున్నారు.
- పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరిగి, అతి తక్కువ కాలంలోనే అవి పట్టణాల్లో అంతర్భాగమవుతున్నాయి. తద్వారా పట్టణాలు వేగంగా విస్తరిస్తున్నాయి.
- కేంద్ర, రాష్ట్రాలు అమలు చేసే వివిధ పట్టణాభివృద్ధి, నివాస పథకాలు, పట్టణ జీవనోపాధి మిషన్ వంటి కార్యక్రమాలు కూడా పట్టణీకరణకు బాటలు వేస్తున్నాయి.
- భారతదేశంలో పట్టణీకరణ ముఖ్యమైన ప్రక్రియగా మారింది. ఇది జాతీయ ఆర్థిక వృద్ధితో పాటు తగ్గుతున్న పేదరికానికి ముఖ్యమైన సూచనగా ఉంది.
2050 నాటికి 50 శాతం పట్టణాల్లోనే..
- 2011 జనాభా లెక్కల ప్రకారం 377 మిలియన్లు (37.71 కోట్ల మంది) అంటే దేశ జనాభాలో 31.16 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2031 నాటికి ఈ సంఖ్య 60 కోట్లకు చేరుతుందని అంచనా.
- పట్టణాలు గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 60 శాతం కంటే ఎక్కవ వాటాను పట్టణ జనాభా అందిస్తుండడమే అందుకు నిదర్శనం.
- 2001లో దేశంలో 5,161 పట్టణాలు ఉండగా.. 2011 నాటికి వాటి సంఖ్య 7,933కి పెరిగింది. 2050 నాటికి దేశ జనాభాలో 50 శాతం పట్టణాల్లోనే ఉంటుంది.
- భారతదేశ జనాభా 2050 నాటికి 164 కోట్లకు చేరుకుంటుందని అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో అంతర్భాగమైన స్వతంత్ర జనాభా, ఆరోగ్య పరిశోధన కేంద్రం ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. ఈ లెక్కల ప్రకారం మరో 30 ఏళ్లకు భారతదేశ పట్టణ జనాభా 82 కోట్లకు చేరుకుంటుంది.
- వేగవంతమైన పట్టణీకరణ వల్ల.. తాగు నీరు, పారిశుద్ధ్యం, పట్టణ రవాణా వంటి సేవలను మెరుగుపరచడం వంటి అనేక సవాళ్లను స్థానిక సంస్థలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు పట్టణ పేదరికాన్ని తగ్గించడం, మురికివాడల వ్యాప్తి నివారణ వంటివీ చేపట్టాల్సి ఉంటుంది.
దేశ జనాభాలో పట్టణాల్లో నివసించే వారి పెరుగుదల ఇలా.. |
||
సంవత్సరం |
జనాభా(కోట్లలో) |
పట్టణ శాతం |
1951 |
36.10 |
17.29 |
1961 |
43.92 |
17.97 |
1971 |
54.81 |
19.91 |
1981 |
68.33 |
23.34 |
1991 |
84.64 |
25.71 |
2001 |
102.87 |
27.81 |
2011 |
121.02 |
31.16 |
2050 |
164.00 |
50 కి పైగా(అంచనా) |
Free Electricity: ఉచిత కరెంట్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2050 నాటికి 50 శాతం జనాభా పట్టణాల్లో ఉంటారని అంచనా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ‘‘2021–22 వార్షిక నివేదిక’’
ఎందుకు : ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం గ్రామీణులు పట్టణాలకు వలస వెళుతుండటంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్