Free Electricity: ఉచిత కరెంట్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?
గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల చొప్పున ఉచితంగా కరెంటిస్తామని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 16న ప్రకటించింది. 2022, జూలై ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అయితే రెండు నెలలకు కలిపి 600 యూనిట్లు దాటిటే మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు, స్వాతంత్య్ర సమరయోధులు మాత్రం 600 యూనిట్లకు మించి వినియోగించిన మేరకు చెల్లిస్తే చాలని పేర్కొంది. ‘‘ఉచిత కరెంట్ పథకం వల్ల ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల భారం పడుతుంది. కానీ 80% మంది గృహ విద్యుత్ వినియోగదారులకు లబ్ధి కలుగుతుంది’’ అని ప్రభుత్వ అంచనా.
PM Modi: 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉచిత కరెంట్ పథకాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం?
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా..
ఎందుకు : గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్ల చొప్పున ఉచితంగా కరెంట్ అందించేందుకు..
GK Persons Quiz: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కొత్త కమాండెంట్?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్