CM Shivraj Singh Chouhan: లతా మంగేష్కర్ మ్యూజిక్ అకాడమీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్(92) జ్ఞాపకార్థం మధ్యప్రదేశ్‌లోని ఆమె జన్మస్థలం ఇండోర్‌లో ఫిబ్రవరి 7న రాష్ట్ర ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ మొక్క నాటారు. ఇండోర్‌లో లత విగ్రహం, ఆమె పాటలతో మ్యూజియం, ఆమె పేరిట కాలేజీ, మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఏటా లత జయంతి నాడు ఆమె పేరుతో అవార్డు ఇస్తామని చెప్పారు. 1929, సెప్టెంబర్ 28న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో లత జన్మించారు.
లతకు పార్లమెంటు నివాళి
న్యూఢిల్లీ: అమర గాయని లతా మంగేష్కర్ స్మృత్యర్థం పార్లమెంటు ఉభయసభలు ఫిభ్రవరి 7న గంటపాటు వాయిదా పడ్డాయి. లత మరణం సంగీతానికి, కళా రంగానికి తీరని లోటని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా అన్నారు.
కర్ణాటకలో హిజాబ్ గొడవ
కర్ణాటకలో హిజాబ్ (స్కార్ఫ్) గొడవ మరింత ముదురుతోంది. విద్యాసంస్థల్లో నిర్దేశిత ఏకరూప దుస్తులు(యూనిఫామ్) ధరించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొందరు విద్యార్థులు ధిక్కరించారు. ఉడుపి జిల్లాలోని కుందాపూర్‌లో ఓ కాలేజీలో విద్యార్థినులు ఫిబ్రవరి 7న హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యారు. దీంతో వారికోసం కేటాయించిన ప్రత్యేక గదిలోకి వెళ్లాలని ప్రిన్సిపాల్ సూచించారు. ఇందుకు నిరసనగా వారు కాలేజీ బయట రోడ్డుపై బైఠాయించారు. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టనుంది.
చదవండి: ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : లతా మంగేష్కర్ పేరిట మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
ఎక్కడ : ఇండోర్, మధ్యప్రదేశ్
ఎందుకు : గాన కోకిల, సుమధుర గాయని, భారతరత్న లతా మంగేష్కర్(92) జ్ఞాపకార్థం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్