Lok Sabha: రూ.1.48 లక్షల కోట్ల అనుబంధ పద్దుకు ఆమోదం
Sakshi Education
ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1.48 లక్షల కోట్ల అదనపు నిధుల ఖర్చుకు సంబంధించిన అనుబంధ పద్దుకు మార్చి 21న లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.
అదానీ షేర్ల వివాదంపై విపక్ష పార్టీల నిరసనల నినాదాల మధ్యే ఈ పద్దుకు సభ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మొత్తం రూ.2.7 లక్షల కోట్ల అదనపు పద్దును 13వ తేదీనే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అదనపు పద్దుకు సంబంధించి రూ.36,325 కోట్లను ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం ఖర్చుచేయనుంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ సంబంధిత మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.33,718 కోట్ల బకాయిలను ప్రభుత్వం మొత్తం పద్దులో కలిపింది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)
Published date : 22 Mar 2023 03:32PM