Skip to main content

Kharif Crop: ఈ ఖరీఫ్‌ సీజన్‌లో దేశవ్యాప్తంగా పెరిగిన పంటల సాగు

దేశవ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది.
Kharif Crop Cultivation Increased Across the Country  General field of crops with information on increased cultivation area for Kharif season

వరి, పప్పులు, పెసర, రాగి, మొక్కజొన్న, నూనెగింజలు, చెరకు తదితర పంటలు కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు 904 లక్షల హెక్టార్లలో సాగైనట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి 879.22 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలను సాగు చేశారని పేర్కొంది. 
 
గత ఏడాది 263.01 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా ఈ ఏడాది 276.91 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది ఇదే సమయానికి 99.71 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు సాగు జరగ్గా, ఈ ఏడాది 110.61 లక్షల హెక్టార్లకు పెరిగింది. 

వీటితో పాటు.. గతేడాది 174.53 లక్షల హెక్టార్లలో నూనెగింజల సాగవగా ఈసారి 179.69 లక్షల హెక్టార్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ముతక తృణ ధాన్యాలు, చెరకు సాగు కూడా పెరిగింది. సాగు పెరగడంతో పప్పు, నూనెగింజల ధరలు తగ్గొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది.

Mann Ki Baat: ‘ఈ దుస్తులు కొనండి’.. పెరిగిన ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు

Published date : 05 Aug 2024 03:56PM

Photo Stories