India-Nepal Border Seal: ఉత్తరాఖండ్-నేపాల్ సరిహద్దుల మూసివేత.. కారణం ఇదే!
తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా, ఉత్తరాఖండ్- నేపాల్ సరిహద్దులను ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 72 గంటల పాటు మూసివేయనున్నారు. అలాగే చసరిహద్దు భద్రత కోసం ఎస్‌ఎస్‌బీ సిబ్బందిని నియమించారు.
ఏప్రిల్ 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు భారత్- నేపాల్ సరిహద్దులను మూసివేయనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఓటింగ్ ప్రకియ ముగిసిన తర్వాత భారత్-నేపాల్ సరిహద్దులు తెరవనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేపాల్ నుంచి భారత్ వచ్చేందుకు లేదా నేపాల్ వెళ్లడానికి ఆర్మీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
Ram Lalla Silver Coin: అయోధ్య రాముడి వెండి నాణెం విడుదల.. ధర ఎంతంటే..
ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నేపాల్.. ఉత్తరాఖండ్‌తో పలు సరిహద్దులను పంచుకుంటుంది. ఈ సరిహద్దులన్నింటిలో ఆర్మీ సిబ్బందిని మోహరించారు.