IIT Jodhpur: రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఐటీ జోధ్‌పూర్ సరికొత్త ఆవిష్కరణ
Sakshi Education
ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్స్(ఐఓవీ) నెట్‌వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకొనే సరికొత్త టెక్నాలజీని ఐఐటీ జోధ్‌పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు.
నావెల్ ఎంఏసీ బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్(నోమాస్) అనే సాంకేతికతను అభివృద్ధి చేసి వాహనాల్లో ఇన్ స్టాల్ చేశారు. దీనిద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల మధ్య రియల్‌టైంలో సమాచార బదిలీ జరిగి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని.. దీన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ జోధ్‌పూర్ కంప్యూటర్‌సైన్స్, ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేబాశిష్‌దాస్ తెలిపారు. వాహనాల దొంగతనం, అనధికార వినియోగానికి ఈ సాంకేతికతతో చెక్‌పెట్టొచ్చని వెల్లడించారు.
చదవండి: AP Assembly Budget Session Live Updates: ఏపీ అసెంబ్లీ 2024 బడ్జెట్ సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..
Published date : 05 Feb 2024 05:35PM