Healthcare Services: వైద్య సేవలు ఏ చట్టం పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తెలిపింది?
వైద్యులు, ఆరోగ్య సేవలు సైతం వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 పరిధిలోకి వస్తాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం సమర్థించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మెడికోస్ లీగల్ యాక్షన్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.
GK Awards Quiz: పద్మభూషణ్ అందుకున్న మొదటి పారా అథ్లెట్?
ప్రస్తుతం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా విస్తరించబోయే 17 జాతీయ రహదారుల పనులకు ఏప్రిల్ 29న కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అలాగే విస్తరణ పనులు పూర్తి చేసుకున్న రెండు జాతీయ రహదారులను ఆయన జాతికి అంకితం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారులు 2024 నాటికి అమెరికా స్థాయి ప్రమాణాలతో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుంచి 2024 నాటికి పదేళ్ల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల కేంద్ర నిధులతో జాతీయ రహదారుల విస్తరణ జరుగుతుందని చెప్పారు.Judicial Conference: 39వ హైకోర్టు సీజేల సదస్సును ఎక్కడ నిర్వహించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్