Election Commission of India: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితి?
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితిని భారత ఎన్నికల సంఘం పెంచింది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ప్రచార వ్యయ పరిమితిని రూ. 70 నుంచి 95 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 54 నుంచి 75 లక్షలు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిని రూ. 28 నుంచి 40 లక్షలకు (పెద్ద రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు), రూ. 20 నుంచి 28 లక్షలకు (చిన్న రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు) పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం జనవరి 6న వెల్లడించింది. రాబోయే ఎన్నికల నుంచి ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో 2022, ఫిబ్రవరి మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
చదవండి: ఎన్ని స్టేషన్లలో రైల్‌వైర్ సాథీ కియోస్క్‌లను ప్రారంభించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ప్రచార వ్యయ పరిమితి పెంపు
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : భారత ఎన్నికల సంఘం
ఎందుకు : రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్