Assembly Elections 2023: మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయి. జనవరి 31న నోటిఫికేషన్ రానుంది. ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ జనవరి 18వ తేదీ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. మార్చిలో పరీక్షలున్నందున ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్ణయించినట్టు వివరించారు. వాతావరణం, భద్రత తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
లక్షద్వీప్ లోక్‌సభ స్థానంతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు కూడా ఫిబ్రవరి 27నే ఉప ఎన్నికలు జరగనున్నాయి.
వీటిలో మహారాష్టలో 2, అరుణాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడుల్లో ఒక్కో అసెంబ్లీ స్థానం ఉన్నాయి. లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ క్రిమినల్ కేసులో దోషిగా తేలి అనర్హతకు గురవడంతో ఆ స్థానం ఖాళీ అవడం తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ మరణంతో పంజాబ్‌లోని జలంధర్ లోక్‌సభ స్థానం ఖాళీ అయినా లోక్‌సభ సచివాలయం నుంచి ఈసీకి అధికారికంగా సమాచారం లేకపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరగడం లేదు.
Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య ‘వందే భారత్’ రైలు
త్రిపుర..
రాష్ట్రంలో పాతికేళ్ల వామపక్ష పాలనకు బీజేపీ ఎట్టకేలకు 2018లో తెర దించింది. మొత్తం 60 సీట్లకు గాను 33 స్థానాలు నెగ్గి అధికారంలోకి వచ్చింది. సీపీఎంను 15 సీట్లకు పరిమితం చేసింది. బీజేపీ మిత్రపక్షమైన గిరిజన పార్టీ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) 4, కాంగ్రెస్ ఒక స్థానం గెలుచుకున్నాయి. ప్రస్తుతం 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిప్లవ్ దేబ్ సీఎంగా పగ్గాలు చేపట్టారు. పేలవ పనితీరు కారణంగా 2022 మేలో ఆయన్ను తొలగించి డాక్టర్ మాణిక్ సాహాను బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసింది. ఆయన కూడా రాష్ట్ర బీజేపీలో అసమ్మతి స్వరాలను శాంతింపజేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఐపీఎఫ్‌టీతోనూ బీజేపీకి ఉప్పూనిప్పుగానే ఉంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే రాష్ట్రంలో పర్యటించారు.
ప్రస్తుత బలాబలాలు
అసెంబ్లీ స్థానాలు | 60 |
బీజేపీ | 33 |
ఐపీఎఫ్‌టీ | 4 |
సీపీఎం | 15 |
కాంగ్రెస్ | 1 |
ఖాళీలు | 7 |
Karnataka Elections 2023: గృహిణులకు నెలకు రూ.2 వేలు
మేఘాలయ ..
మొత్తం 60 సీట్లకు గాను 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో గెలిచి ఏకైక పెద్ద పారీ్టగా నిలిచింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) 20, తృణమూల్ 9, యూడీపీ 8, బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. ఎన్‌పీపీ, యూడీపీ, బీజేపీ కలయికతో మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) పేరుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్‌పీపీ నేత కాన్రాడ్ సంగ్మా సీఎం అయ్యారు. అనంతరం డజను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం ముకుల్ సంగ్మా ఎన్సీపీలో చేరడంతో అది ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది! ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాలతో ప్రస్తుతం 18 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
మరోవైపు పలువురు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరడంతో అధికార సంకీర్ణంలోనూ లుకలుకలు బయల్దేరాయి! ఒక దశలో ఇకపై తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సీఎం సంగ్మా ప్రకటించేదాకా వెళ్లింది! ఈసారి ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నెస్ట్ మావ్రీ బుధవారం ప్రకటించారు. ఇలా రాష్ట్రంలో రాజకీయం కప్పల తక్కెడను తలపిస్తోంది. టీఎంసీ ఈసారి మరింత గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుత బలాబలాలు
అసెంబ్లీ స్థానాలు | 60 |
ఎన్‌పీపీ | 20 |
యూడీపీ | 8 |
టీఎంసీ | 8 |
పీడీఎఫ్ | 2 |
బీజేపీ | 2 |
ఎన్సీపీ | 1 |
స్వతంత్రులు | 1 |
ఖాళీలు | 18 |
Miss Universe 2022: మిస్ యూనివర్స్‌గా ఆర్‌బోనీ గాబ్రియల్
నాగాలాండ్ ..
యునైటెడ్ డెమొక్రటిక్ అలయన్స్ (యూడీఏ) పేరుతో బీజేపీ, నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఎన్‌డీపీపీ నేత నిపు రియో సీఎంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో 26 సీట్లతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచిన ఎన్‌పీఎఫ్ కూడా సంకీర్ణంలో చేరడంతో రాష్ట్రంలో ప్రతిపక్షమనేది లేకుండా పోయింది! ఎన్‌డీపీపీ 18, బీజేపీ 12, ఎన్‌పీపీ 2 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ ఈసారి 20 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.
ప్రస్తుత బలాబలాలు
అసెంబ్లీ స్థానాలు | 60 |
ఎన్‌డీపీపీ | 41 |
బీజేపీ | 12 |
ఎన్‌పీఎఫ్ | 4 |
స్వతంత్రులు | 2 |
ఖాళీలు | 1 |