Skip to main content

14th Vice Presidentగా ధన్‌ఖడ్‌ ప్రమాణం

భారత ఉపరాష్ట్రపతిగా.. దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆగస్టు 11న ప్రమాణస్వీకారం చేశారు.
Dhankhar oath as 14th Vice President
Dhankhar oath as 14th Vice President

ఇటీవల రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించిన ద్రౌపదీ ముర్ము ఆయన చేత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేయించారు. ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌ ఇందుకు వేదికైంది.      హిందీలో ‘దైవసాక్షిగా’.. అంటూ ధన్‌ఖడ్‌ ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, ఇతర ముఖ్యలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణస్వీకారానికి ముందు ఉదయం ధన్‌ఖడ్‌ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. 

Also read: Common Wealth Fencing లో భవానికి స్వర్ణం

2019 నుంచీ పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్న ధన్‌ఖడ్‌ ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాను ఓడించారు. గతంలో ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు లాయర్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్నారు. 

Also read: ED HYD అడిషనల్ డైరెక్టర్ గా దినేష్‌ పరుచూరి
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 12 Aug 2022 05:57PM

Photo Stories