ED HYD అడిషనల్ డైరెక్టర్ గా దినేష్ పరుచూరి
Sakshi Education
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం అడిషనల్ డైరెక్టర్‌గా దినేష్ పరుచూరి నియమితులయ్యారు.
ప్రస్తుతం ఈడీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న అభిషేక్ గోయల్‌ను ముంబైకి బదిలీ చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆగస్టు 10న ఉత్త ర్వులు జారీ చేసింది. ఆదాయ పన్నుల శాఖకు చెందిన దినేష్ పరుచూరి జూలై 31న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కు డిప్యుటేషన్‌పై రాగా.. ఆయనను హైదరాబాద్‌లో అడిషనల్ డైరెక్టర్ గా నియమించారు. అభిషేక్ గోయల్‌ను ముంబై జోన్–2కు బదిలీ చేసి పనాజీ, రాయ్ పూర్ జోన్‌ల అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. కాగా ప్రస్తుతం ముంబై జోన్–2లో ఉన్న అడిషనల్ డైరెక్టర్ యోగేష్ శర్మను ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఇంటెలి జెన్స్ విభాగంలో నియమించారు.
Also read: Nepal Cricket హెడ్ కోచ్‌గా ప్రభాకర్
Published date : 11 Aug 2022 06:14PM