Skip to main content

Election Commission: ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వ‌జిత్‌.. విజయవాడ సీపీగా రామక్రిష్ణ

Kumar Vishwajeet As AP New Intelligence Chief    PhD Ramakrishna, newly appointed Vijayawada Police Commissioner

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంటెలిజెన్స్‌ డీజీగా కుమార్‌ విశ్వజిత్‌ను, విజయవాడ పోలీస్ క‌మిష‌న‌ర్‌(సీపీ)గా పీహెచ్‌డీ రామకృష్ణను నియ‌మిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏప్రిల్ 24వ తేదీ ఆదేశాలు జారీ చేసింది.
 
రాష్ట్ర ప్ర‌భుత్వం పంపిన ప్యానెల్‌ను ప‌రిశీలించిన ఈసీ తుది నిర్ణ‌యం తీసుకుని ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి, ఏపీ సీఈవోకి స‌మాచారం ఇచ్చింది. కొత్త‌గా నియ‌మితులైన ఈ ఇద్ద‌రు అధికారులు త‌క్ష‌ణ‌మే బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించింది. 

కాగా.. ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఏపీ ఈసీ ఏప్రిల్ 23వ తేదీ నిర్ణయం తీసుకుంది. 

New Election Commissioners: కొత్త ఎలక్షన్‌ కమిషనర్లు వీరే..

Published date : 26 Apr 2024 12:03PM

Photo Stories