Covid-19: కార్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను తయారు చేసిన సంస్థ ఏది?
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో టీకాను మరింతగా వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఆమోద ముద్ర వేసింది. భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకి ఇవ్వడానికి, బయోలాజికల్–ఇ కంపెనీ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌ను 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకి వేయడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 26న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.
డీఎన్‌ఏ ప్లాస్మిడ్ టెక్నాలజీతో అభివృద్ధి చేయబడిన తొలి వ్యాక్సిన్?
ఇక 12 ఏళ్లపైబడిన వారికి(పెద్దల్లోనే కాకుండా 12 –18 ఏళ్లవారికి కూడా..) క్యాడిలా ఫార్మా సంస్థ తయారు చేసిన ‘‘జైకోవ్–డి’’ వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ టీకాను 3 ఎంజీ చొప్పున 28 రోజుల వ్యవధిలో రెండు డోసులుగా ఇవ్వడానికి ఆమోదించింది. ప్రస్తుతం జైకోవ్–డిని 2 ఎంజీ చొప్పున మూడు డోసులుగా ఇస్తున్నారు.GK Persons Quiz: రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుగా నియమితులైనది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను 6 నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లలకి ఇవ్వడానికి, బయోలాజికల్–ఇ కంపెనీ తయారు చేసిన కార్బెవ్యాక్స్‌ను 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకి వేయడానికి డీసీజీఐ అనుమతి
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ
ఎందుకు : దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్