Good News: స్వేచ్ఛగా ఊపిరి.. ఇకపై కోవిడ్ ఆంక్షలు ఉండవ్..!
మార్చి 31 నుంచి కరోనా కట్టడికి విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కానీ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ కలకలం సృష్టించినప్పుడు 2020 మార్చి 24న కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కోవిడ్ నిబంధనల్ని తెచ్చింది.
కరోనా కట్టడికి ఈ రెండేళ్లలో పలుమార్లు నిబంధనల్ని మార్చింది. గత ఏడు వారాలుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా తగ్గిపోతూ ఉండడంతో మార్చి 31 నుంచి ఈ నిబంధనలన్నింటినీ ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకి లేఖ రాశారు.
Omicron: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు బతికుంటుందో ఉంటుందో తెలుసా..?
అయితే నిబంధనలు మాత్రం తప్పనిసరిగా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో 181.89 కోట్ల టీకా డోసుల్ని ఇచ్చారు. అందుకే ప్రస్తుతానికి విపత్తు నిర్వహణ చట్టం కింద అమల్లో ఉన్న కరోనా కట్టడి ఆంక్షల్ని ఎత్తేస్తున్నట్టు అజయ్ భల్లా ఆ లేఖలో వివరించారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ సూచించిన విధంగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటివన్నీ అమల్లోనే ఉంటాయి.
Covid Effect: ఊహకందని విషయం ఇది.. 7 నెలల కన్నా ఎక్కువ కాలం మనిషి శరీరంలో...?
New Virus in China:మళ్లీ కొత్త వైరస్? ..అసలు సంగతి ఇదే.. ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే..
కరోనా వైరస్ ఎప్పుడు ఎలా రూపాంతరం చెందుతుందో తెలీని పరిస్థితి కాబట్టి ప్రభుత్వాలు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అజయ్ భల్లా ఆ లేఖలో హెచ్చరించారు. ఒకవేళ ఎక్కడైనా కేసులు పెరిగితే వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిబంధనలు అమల్లోకి తేవచ్చు. కేంద్ర హోంశాఖ చేసిన సూచనల్ని కూడా పాటించాల్సి ఉంటుంది.
New variant: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం.. లక్షణాలు ఇవే..
Good News : ఏడాది చివరికి కరోనా అంతం..! డబ‍్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన..