Supreme Court: ‘మరణశిక్ష తగ్గింపుపై’ విస్తృత ధర్మాసనం
Sakshi Education
మరణ శిక్ష విధించే కేసుల విచారణ సమయంలో శిక్ష తగ్గింపు నిర్ధారణకు స్పష్టమైన విధివిధానాల రూపకల్పన అంశాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను సీజేఐ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ ఎస్.ధులియాలతో కూడిన బెంచ్ విచారించింది. ఈ కేసును సర్వోన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా తీసుకుంది. మరణ శిక్షను తగ్గించగల ప్రతి పరిస్థితిని విచారణ దశలోనే న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలన్నది పిల్‌లో సారాంశం. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 03 Oct 2022 05:55PM