Quantum Mission: రూ.6,003 కోట్లతో కేంద్రం క్వాంటమ్ మిషన్.. ఇంతకీ క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి?
దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ విభాగాల్లో నాలుగు థీమాటిక్ హబ్స్(టీ–హబ్స్) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠిన నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామన్నారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ అండ్ టెక్నాలజీ) క్విజ్ (12-18 మార్చి 2023)
క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి..?
క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇంజనీరింగ్, భౌతిక శాస్త్రం విభాగాల కలయిక. ఇది గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్‌లోని మౌలికాంశాల ఆధారంగా పనిచేస్తుంది. ఇందులోని క్వాంటమ్ మెకానిజం సూత్రాల ఆధారంగా కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయొచ్చు. ఈ క్వాంటమ్ మెకానిజం శక్తిని పరమాణువుల సామర్థ్యంతో కొలుస్తాయి. ఇందులో ఫిజిక్స్‌లోని సాధారణ నియమాలు వర్తించవు. క్వాంటమ్ టెక్నాలజీలో మూడు భాగాలుంటాయి. అవి క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ/కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్. సాధారణ కంప్యూటర్లు 0, 1 ఆధారంగా పనిచేస్తే, క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ బిట్స్/క్యూబిట్స్ ఆధారంగా పనిచేస్తాయి. వేగం, కచ్చితత్వంతో పనిచేయడమే క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రత్యేకత.