Ayodhya: ‘రామాలయం’ సమీపాన ఆ రాష్ట్ర భవనం..!
జనవరి 22వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వస్తున్నారు. దేశంలోని ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటైన గుజరాత్ తమ రాష్ట్రంలోని భక్తులకు అయోధ్యలో సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్యింది. అయోధ్యలో గుజరాత్ భవన్ నిర్మించేందుకు గుజరాత్ ప్రభుత్వం అయోధ్యలో భూమిని కొనుగోలు చేసింది. సమీప భవిష్యత్తులో భవన నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి.
గుజరాత్ ప్రజలు పెద్ద సంఖ్యలో తీర్థయాత్రలకు తరలి వెళుతుంటారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని రామాలయాన్ని చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అటువంటి పరిస్థితిలో తమ రాష్ట్ర పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని, గుజరాత్ ప్రభుత్వం అయోధ్యలో గుజరాత్ భవన్ నిర్మించడానికి భూమిని కొనుగోలు చేసింది.
అయోధ్యలో రామభక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసిందని, గుజరాతీలకు చక్కని సౌకర్యాలు అందించేలా సమీప భవిష్యత్తులో అత్యుత్తమ భవనాన్ని నిర్మిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హృషికేశ్ పటేల్ అన్నారు.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం– బాల రాముని ప్రాణ ప్రతిష్ట