Amit Shah: నేషనల్ సైన్స్ యూనివర్సిటీకి ఏ రాష్ట్రంలో శంకుస్థాపన చేశారు?
గోవా రాష్ట్రం దక్షిణ గోవా జిల్లాలోని ధర్బండోరాలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అక్టోబర్ 14న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ క్యాంపస్‌కు శంకుస్థాపన చేసి, ప్రసంగించారు. 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్ ద్వారా బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అక్రమంగా సరిహద్దులు వచ్చి, దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు. కశ్మీర్‌లోని ఉడి ఆర్మీ బేస్‌పై ఉగ్రదాడికి ప్రతిగా 2016 సెప్టెంబర్ 29వ తేదీన భారత ఆర్మీ నియంత్రణరేఖను దాటి వెళ్లి మెరుపుదాడులు చేపట్టి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.
కోవెలకు ఆచార్య పోలూరి అవార్డు
తన గురువు, తెలుగు ఆచార్యులైన పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పేరిట ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో అవార్డును ఏర్పాటు చేశారు. అక్టోబర్ 13న ఆయన తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్యకు అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... తెలుగు భాష సంరక్షణ కోసం 1943లో తెలంగాణ సారస్వత పరిషత్ ఏర్పాటైందని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ఎక్కడ : ధర్బండోరా, దక్షిణ గోవా జిల్లా, గోవా రాష్ట్రం
చదవండి: గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితి ఎన్ని వారాలు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్