Abortion limit: గర్భ విచ్ఛిత్తి చేసుకోవడానికి గరిష్ట పరిమితి ఎన్ని వారాలు?
గర్భ విచ్ఛిత్తిపై కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు ఉద్దేశించిన మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021ను అక్టోబర్ 13న నోటిఫై చేసింది. 2021, మార్చి నెలలో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ చట్టం ప్రకారం... లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మైనర్లు, గర్భధారణ సమయంలో వైధవ్యం పొందడం, విడాకులు తీసుకోవడం, మానసిక అనారోగ్యం ఉన్నవారు, పిండం పూర్తిగా రూపం దాల్చని పరిస్థితుల్లో ఉన్నవారు, ప్రభుత్వం ఆత్యయిక స్థితిని ప్రకటించినపుడు, విపత్తు సమయాల్లో గర్భం దాల్చిన వారు 24 వారాల్లోగా గర్భ విచ్ఛిత్తి చేసుకోవచ్చు.
చదవండి: గతి శక్తి–నేషనల్ మాస్టర్ ప్లాన్ లక్ష్యం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(సవరణ) చట్టం–2021 అమలు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : భారత ప్రభుత్వం
ఎక్కడ : దేశవ్యాప్తంగా...
ఎందుకు : ప్రత్యేక కేటగిరీల మహిళలకు గర్భ విచ్ఛిత్తి(అబార్షన్) గరిష్ట పరిమితిని 20 వారాల నుంచి 24 వారాలకు పెంచేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్