54th International Film Festival of India: నవంబర్ 20 నుంచి గోవాలో 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్
ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో 13 ప్రపంచ ప్రీమియర్‌లతో సహా అంతర్జాతీయ విభాగంలో 198 సినిమాలు ప్రదర్శించనున్నారు. ఇందులో ప్రారంభ చిత్రంగా కాచింగ్ డస్ట్, మిడ్-ఫెస్ట్ ఫిల్మ్‌గా ఎబౌట్ డ్రై గ్రాసెస్ ముగింపు చిత్రంగా ది ఫెదర్ వెయిట్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
Global Responsible Tourism Award: గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డుని కైవసం చేసుకున్న కేరళ
భారతీయ చిత్రాల విభాగంలో విభాగం భారతదేశం నుంచి 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లను ప్రదర్శించనున్నారు. ఫీచర్ విభాగంలో ప్రారంభ చిత్రంగా మలయాళం చిత్రం ఆటమ్‌ను, నాన్ ఫీచర్ విభాగంలో మణిపూర్‌కు చెందిన ఆండ్రో డ్రీమ్స్‌ను ప్రదర్శించనున్నారు.
ఈ సంవత్సరం వివిధ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల నుంచి 19 అవార్డులు గెలుచుకున్న చిత్రాలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డు కోసం 15 ఓ.టి.టి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి 10 భాషల్లో 32 వెబ్ సిరీస్ పోటి పడుతున్నాయి. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మైఖేల్ డగ్లస్ సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నారు.
National Film Awards 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు... పూర్తి జాబితా ఇదే
Tags
- 54th International Film Festival of India to be held from november 20
- 54th International Film Festival of India
- 54th IFFI to be held from November 20 to 28 in Goa
- Anurag Thakur
- Union Minister
- Film Festival in Goa
- International Film Festival
- Goa Event
- Indian Cinema
- Cultural Celebrations
- Annual Festival
- Cinema Showcase
- Sakshi Education Latest News