Sagar Mala Project: సాగర్‌మాల కింద ఎన్ని ప్రాజెక్టులను చేపట్టనున్నారు?
Sakshi Education

సాగర్‌మాల కార్యక్రమం కింద రూ.6.5 లక్షల కోట్ల విలువైన 1,537 ప్రాజెక్టులను అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రకటించారు. తీరప్రాంత జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రూ.58,700 కోట్ల వ్యయ అంచనాలతో 567 ప్రాజెక్టులను గుర్తించినట్టు మంత్రి వెల్లడించారు. సాగర్‌మాల దేశవ్యాప్తంగా 7,500 కిలోమీటర్ల పొడవున ఉన్న సాగర తీరాన్ని ఉపయోగించుకుంటూ..పోర్టుల ఆధారిత అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర సర్కారు సాగర్‌మాల కార్యక్రమాన్ని తలపెట్టింది.అలాగే 14,500 కిలోమీటర్ల పొడవునా జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఉంది.
PM Modi: ఇటీవల ఏ రాష్ట్రంలో 2,985 అమృత్ సరోవర్ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?
Published date : 16 May 2022 07:44PM