US INDIA Chamber of Commerce: టెక్సాక్‌లో గ్రాండ్‌గా యూఎస్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్
డల్లాస్ వేదికగా జరిగిన ఈ కర్యాక్రమానికి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్, హ్యూస్టన్ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్ ముఖ్య అతిథులుగా హాజరై, ప్రసంగించారు. భారత్-అమెరికా దేశాల మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక వాణిజ్యాల గురించి వారు ప్రస్తావించారు.
Russia Withdrawal from CTBT: సీటీబీటీ నుంచి వైదొలగిన రష్యా
టెక్సాక్-భారత్ ఆర్థిక సంబంధాలు వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. టెక్సాస్ వృద్ధిలో భారతీయ అమెరికన్ల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ, అమెరికన్ పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
1999లో ఈ ఛాంబర్‌ని ప్రారంభించామని, ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా వార్షిక అవార్డ్స్ బాంకెట్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించినట్లు తెలిపారు. 24వ వార్షిక అవార్డ్స్ బాంకెట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వహకులు ధన్యవాదాలు తెలిపారు.