Skip to main content

Russia Withdrawal from CTBT: సీటీబీటీ నుంచి వైదొలగిన రష్యా

అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ (సీటీబీటీ) ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంటు ఎగువ సభ ఫెడరేషన్‌ కౌన్సిల్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆమోదం తెలపడంతో రష్యా సీటీబీటీ నుండి అధికారికంగా వైదొలిగింది.
Russia's formal departure from Comprehensive Nuclear-Test-Ban Treaty, CTBT exit, Russia Withdrawal from CTBT, President Putin supports Russian exit from CTBT,

 ఇంతకుముందు ఈ తీర్మానానికి రష్యా పార్లమెంటు దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 1996లో కుదిరిన సీటీబీటీ ఒప్పందం ప్రపంచంలో ఎక్కడా కూడా అణ్వస్త్ర పరీక్ష జరగకూడదని నిర్దేశిస్తోంది. ఎగువ సభ ఆమోదం లభించిన కొన్ని గంటల వ్యవధిలోనే రష్యా సైన్యం.. అధ్యక్షుడు పుతిన్‌ సమక్షంలో అణ్వస్త్ర సిమ్యులేషన్‌ అభ్యాసాలను నిర్వహించింది. శత్రుదేశాలు తమ పైకి అణ్వస్త్రాలను ప్రయోగిస్తే వాటి నెలా ఎదుర్కోవాలనే విషయమై వ్యూహాత్మకంగా శిక్షణ ఇస్తున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

US announces new nuclear bomb: సూపర్‌ అణు బాంబును తయారు చేయనున్న అమెరికా

Published date : 11 Nov 2023 11:01AM

Photo Stories