US Air Force: అమెరికా అమ్ములపొదిలోకి డిజిటల్ బాంబర్
అత్యాధునిక మిలిటరీ విమానం బీ–21 రైడర్‌ను అమెరికా వాయు సేన ప్రవేశపెట్టింది. డిసెంబర్ 2న వాయుసేనలోకి చేరిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రపంచంలోనే అత్యాధునికమైనదని అమెరికా తెలిపింది. బీ–1, బీ–2 విమానాల స్థానంలో వీటిని ప్రవేశపెడతామని వెల్లడించింది. అమెరికా డిఫెన్స్ అభివృద్ధి చేసిన ఈ విమానం ఒక్కోదాని ఖర్చు రూ.16 వేల కోట్లు. న్యూక్లియర్ మిషన్లలోనూ ఈ యుద్ధ విమానం పనిచేయగలదు. ప్రపంచంలోనే తొలి 6వ జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇది. దీన్ని రాడార్లు గుర్తించలేవు. ఈ విమానం దాడి చేస్తున్నదని శత్రు దేశ డిఫెన్స్ వ్యవస్థలు తెలుసుకొనేలోపే లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అజైల్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి క్లౌడ్ కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటాతో బీ–21ను అభివృద్ధి చేశారు. అందుకే దీనికి డిజిటల్ బాంబర్ అని పేరు పెట్టారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP