Aero India: ఏరో షోలో అమెరికా బాంబర్ జెట్ బీ1బీ
Sakshi Education
బెంగళూరు శివారులోని యెలహంక ఎయిర్‌బేస్ వినువీధులో జరుగుతున్న ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానం బీ–1బీ లాన్సర్ బాంబర్ జెట్ ఫిబ్రవరి 14న వీక్షకులకు కనువిందు చేసింది.
అమెరికా సుదూర గగనతల లక్ష్యాలను చేధించడంలో వాయుసేనకు వెన్నుముకగా నిలుస్తున్నందుకు గుర్తుగా దీనిని ‘ది బోన్’ అని పిలుస్తారు. ‘ ఇరు దేశాల వైమానిక దళాల అద్భుత అంతర్గత సంయుక్త నిర్వహణ వ్యవస్థకు బీ–1బీ బాంబర్ సానుకూలతను మరింత పెంచింది’ అని అమెరికా ఎయిర్‌ఫోర్స్ మేజర్ జనరల్ జూలియన్ చీటర్ వ్యాఖ్యానించారు. ‘ భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం మరింతగా బలోపేతమవుతోంది. సంయుక్తంగా పనిచేస్తే రెండు దేశాల సైన్యాలు ఇంకా శక్తివంతమవుతాయి’ అని ఢిల్లీలో అమెరికా ఎంబసీలో ఆ దేశ రియర్ అడ్మిరల్ మైఖేల్ బేకర్ అన్నారు. కాగా, ఫిబ్రవరి 13ప అమెరికా ఐదోతరం సూపర్‌సోనిక్ ఎఫ్–35ఏ యుద్ధ విమానం ఈ వైమానిక ప్రదర్శనలో పాలుపంచుకుంది. ఎఫ్35ఏ భారత్‌లో ల్యాండ్ అవడం ఇదే తొలిసారి. బీ–1బీ బాంబర్ మాత్రం 2021 ఫిబ్రవరిలోనూ ఎయిర్‌షోలో పాల్గొంది.
Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో' ప్రారంభం
Published date : 15 Feb 2023 02:53PM