Skip to main content

Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో' ప్రారంభం

ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా–2023’ను ప్రధాని మోదీ ఫిబ్ర‌వరి 13వ తేదీ కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు.
Aero India 2023

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రక్షణ పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్‌ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు. విదేశీ పరికరాలకు మన దేశాన్ని ఒక మార్కెట్‌గా పరిగణించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. శక్తివంతమైన రక్షణ భాగస్వామిగా భారత్‌ తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని పేర్కొన్నారు.  
5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు  
రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఎన్నెన్నో ఘనతలు సాధించామని నరేంద్ర మోదీ తెలియజేశారు. మిలటరీ హార్డ్‌వేర్‌ ఉత్పత్తి విషయంలో మన దేశం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను 1.5 బిలియన్‌ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 బిలియన్‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న ‘తేజస్‌ లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’లు రక్షణ ఉత్పత్తుల రంగంలో మన అసలైన ప్రతిభా పాటవాలకు చక్కటి ఉదాహరణలని వెల్లడించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్‌ సెక్టార్‌ను ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

ఏరో ఇండియా ప్రదర్శనలో వివిధ దేశాల వైమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. లైట్‌ కాంబాట్‌ హెలికాప్టర్‌లో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే, తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి ప్రయాణించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరిగే ‘ఏరో ఇండియా’లో దాదాపు 100 దేశాల రక్షణ శాఖ మంత్రులు, ప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన 800కు పైగా డిఫెన్స్‌ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రక్షణ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 250 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 
ప్రత్యేక ఆకర్షణగా అమెరికా ఎఫ్‌–13ఏ ఫైటర్‌ జెట్లు  
ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన ఐదో తరం సూపర్‌సానిక్‌ మల్టీరోల్‌ ఎఫ్‌–35ఏ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎఫ్‌–35ఏ లైట్నింగ్‌–2, ఎఫ్‌–13ఏ జాయింట్‌ స్ట్రైక్‌ ఫైటర్‌ అమెరికాలోని ఎయిర్‌బేస్‌ల నుంచి సోమవారం బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ అత్యాధునిక ఫైటర్‌ జెట్లు భారత్‌ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎఫ్‌–16 ఫైటింగ్‌ ఫాల్కన్, ఎఫ్‌/ఏ–18ఈ, ఎఫ్‌/ఏ–18ఎఫ్‌ యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి. 

Lithium: బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైన తెల్ల బంగారం

Published date : 14 Feb 2023 05:59PM

Photo Stories