Skip to main content

Bharat Biotech: భారత్‌ తయారీ కోవాగ్జిన్‌ను గుర్తించిన ఐరోపా దేశం?

Covaxin

భారత్‌ తయారీ కోవాగ్జిన్‌ను అనుమతి పొందిన కోవిడ్‌ టీకాల జాబితాలో చేర్చినట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం 2021, నవంబర్‌ 22వ తేదీ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలకు వర్తించనుందని పేర్కొంది. దీంతో కోవాగ్జిన్‌ తీసుకున్న వారు ఇకపై యూకే వెళ్లవచ్చు. భారత్‌ బయోటెక్‌ తయారీ కోవాగ్జిన్‌ టీకా రెండు డోసులు తీసుకుని యూకే వెళ్లిన ప్రయాణికులు ఇకపై ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని నవంబర్‌ 9న భారత్‌లో బ్రిటిష్‌ హై కమిషనర్‌ అలెక్స్‌ ఎల్లిస్‌ తెలిపారు.

25 కోట్ల కేసులు..

రెండేళ్లలోపే ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 25 కోట్లు దాటేసింది. జాన్‌హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం ఇప్పటిదాకా మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య దాదాపుగా 25.5 కోట్లకు చేరుకుంది. కోవిడ్‌ బాధితుల మరణాలు 50.05 లక్షలు దాటేశాయి. చైనాలోని వూహాన్‌లో 2019 డిసెంబర్‌లో తొలిసారిగా ఈ వైరస్‌ను గుర్తించారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్, గ్రీస్, జర్మనీ కరోనా హాట్‌స్పాట్‌లుగా మారాయి. అమెరికాలోని మేరిల్యాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ నగరంలో జాన్‌హాప్‌కిన్స్‌ వర్సిటీ ఉంది.
 

చ‌ద‌వండి: ఇరాక్‌ ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌ తయారీ కోవిడ్‌ టీకా కోవాగ్జిన్‌ను గుర్తించిన ఐరోపా దేశం?
ఎప్పుడు : నవంబర్‌ 1
ఎవరు    : యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : కోవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారిని దేశంలోని అనుమతించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Nov 2021 03:21PM

Photo Stories