Drone Attack: ఇరాక్ ప్రధానమంత్రిగా ప్రస్తుతం ఎవరు ఉన్నారు?
ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా–అల్–కదిమి హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. నవంబర్ 7న వేకువజామున కదిమి నివాసమే లక్ష్యంగా సాయుధ డ్రోన్లతో దాడి జరిగిందని, ఆయనకు ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. 2021, అక్టోబర్ నెలలో వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను ఇరాన్ మద్దతుగల మిలీషియాలు తిరస్కరించడంతో తలెత్తిన ఉద్రిక్తతలకు తాజా ఘటన ఆజ్యం పోసినట్లయింది.
ఇరాక్...
రాజధాని: బాగ్దాద్; కరెన్సీ: ఇరాకీ దినార్
ప్రస్తుత అధ్యక్షుడు: బర్హమ్ సలీహ్
ప్రస్తుత ప్రధానమంత్రి: ముస్తఫా–అల్–కదిమి
సియెర్రాలియోన్‌లో విషాదం
సియెర్రాలియోన్ రాజధాని ఫ్రీటౌన్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలిన ఘటనలో కనీసం 98 మంది సజీవదహనం కాగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని శివారులోని వెల్లింగ్టన్ ప్రాంతంలో నవంబర్ 6న ఒక బస్సు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దెబ్బతిన్న ట్యాంకర్ నుంచి లీకవుతున్న ఆయిల్‌ను పట్టుకునేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఈ సమయంలో పేలుడు ఘటన చోటుచేసుకుంది.
సియెర్రాలియోన్...
రాజధాని: ఫ్రీటౌన్; కరెన్సీ: లియోనే
ప్రస్తుత అధ్యక్షుడు: జూలియస్ మాడ బయో
చదవండి: ఉగ్రవాద సంస్థ టీఎల్‌పీపై నిషేధం ఎత్తివేసిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్