Tehreek-i-Labbaik: ఉగ్రవాద సంస్థ టీఎల్‌పీపై నిషేధం ఎత్తివేసిన దేశం?
ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ)పై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. ఈ మేరకు నాలుగో షెడ్యూల్ నుంచి టీఎల్‌పీని తొలగిస్తూ నవంబర్ 7న ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ కేబినెట్ ఉగ్రవాద ని«రోధక చట్టం, 1997 ద్వారా టీఎల్‌పీపై విధించిన నిషేధాన్ని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు ఎత్తివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. గతకొద్ది నెలలుగా పాకిస్తాన్‌లో టీఎల్‌పీ హింసను రాజేస్తోంది.
ఏమిటీ టీఎల్‌పీ?
తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ అంటే మహమ్మద్ ప్రవక్త అనుచరుల ఉద్యమం (బరేల్వి) అని అర్థం. ఇస్లాంను దూషించేవారిని కఠినంగా శిక్షించడం, దీనికి సంబంధించిన చట్టాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడడానికే ఈ సంస్థ పుట్టుకొచ్చింది. పాకిస్తాన్‌లో సగం మంది ప్రజల్లో బరేల్వి ఉద్యమం పట్ల మద్దతు ఉంది. సూఫీ సంప్రదాయాలతో కూడిన ఇస్లాంను వ్యాప్తి చేయడమే వీరి ఉద్దేశం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇస్లాం ఉగ్రవాద సంస్థ తెహ్రీక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్‌పీ)పై నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : పాకిస్తాన్ ప్రభుత్వం
ఎక్కడ : పాకిస్తాన్
ఎందుకు : పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం చేసిన సిఫారసుల మేరకు...
చదవండి: దీపావళిని సెలవు బిల్లును ఏ దేశంలో ప్రవేశపెట్టారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్