Deepavali Day Act: దీపావళిని సెలవు బిల్లును ఏ దేశంలో ప్రవేశపెట్టారు?
భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే దీపావళి పండుగ రోజును జాతీయ సెలవు రోజుగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్‌లో దీపావళి డే బిల్లును ప్రవేశపెట్టారు. దీపావళి డే బిల్లును సభలో ప్రవేశపెట్టినట్లు న్యూయార్క్‌కు చెందిన కాంగ్రెస్ మహిళ కరోలిన్ బి మలోనీ నేతృత్వంలోని చట్టసభ సభ్యులు నవంబర్ 3న ప్రకటించారు. ఈ బిల్లుకు భారతీయ–అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా అనేక మంది చట్టసభ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఈ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత ఆమోద ముద్ర పడితే ఇకపై అమెరికాలో దీపావళి రోజున అధికారికంగా సెలవుగా ప్రకటిస్తారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పేరు?
దీపావళి మర్నాడు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరుపుకునే గోవర్ధన్ పూజను పురస్కరించుకొని ప్రజాసంక్షేమం, రాష్ట్ర సుసంపన్నం కోసమని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా జంజ్‌గిరి గ్రామంలో నవంబర్ 5న జరిగిన వేడుకల్లో సీఎం భూపేశ్ పాల్గొని, కొరడా దెబ్బలు తిన్నారు.
చదవండి: గాంధీ స్మారక నాణెన్ని విడుదల చేసిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా కాంగ్రెస్‌లో దీపావళి డే బిల్లు
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : న్యూయార్క్‌కు చెందిన కాంగ్రెస్ మహిళ కరోలిన్ బి మలోనీ
ఎందుకు : భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే దీపావళి పండుగ రోజును జాతీయ సెలవు రోజుగా ప్రకటించాలని...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్