Skip to main content

Sri Lanka New President Ranil Wickremesinghe : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నిక‌

శ్రీలంకలో మరో అన్యూహ ఘటన చోటుచేసుకుంది. జూలై 20వ తేదీన (బుధవారం) జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
Ranil Wickremesinghe
Sri Lanka New President Ranil Wickremesinghe

లంక 8వ అధ్యక్షుడిగా విక్రమ సింఘేను ఎంపీలు ఎన్నుకున్నారు. ఈరోజు జరిగిన ఓటింగ్‌లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికల్లో విక్రమ సింఘేకు మద్దతుగా 134 ఓట్లు రాగా.. అలాహా పెరుమాకు 82 ఓట్లు, అనురాకుమారకు 3 ఓట్లు పడ్డాయి. కాగా, ‍మొత్తం పోలైన ఓట్లు 219. ఇదిలా ఉండగా.. రణిల్‌ విక్రమసింఘే ఇప్పటి వరకు లంక ప్రధానిగా ఆరుసార్లు పనిచేశారు.

Gotabaya Rajapaksa : శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స రాజీనామా.. కారణం ఇదే..?

దేశం విడిచి..
ప్రజాగ్రహానికి జడిసి దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స(73) ఎట్టకేలకు ఇటీవ‌లే తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెల్సిందే. రాజీనామా లేఖను  జూలై 14వ తేదీన (గురువారం) శ్రీలంక పార్లమెంట్‌ స్పీకర్‌ మహిందా అబేయవర్దనేకు పంపించారు. సింగపూర్‌లోని శ్రీలంక హైకమిషన్‌ నుంచి లేఖ అందిందని స్పీకర్‌ మీడియా కార్యదర్శి ప్రకటించారు.

Sri Lanka Crisis: రోజులు మారాలి!

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం..   
ప్రజల డిమాండ్‌ను అంగీకరిస్తూ ప్రధానిగా తప్పుకుంటానని విక్రమసింఘే ఇప్పటికే ప్రకటించారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేస్తే పార్లమెంట్‌ స్పీకర్‌ గరిష్టంగా 30 రోజులు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండొచ్చు.

Download Current Affairs PDFs Here

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

GK Awards Quiz: ఏ భారతీయ వాస్తుశిల్పికి 2022 రాయల్ గోల్డ్ మెడల్ లభించింది?

Published date : 20 Jul 2022 01:16PM

Photo Stories