Skip to main content

Yuddha Abhyas 2022: చైనా సరిహద్దుల్లో..భారత్, అమెరికా 'యుద్ధ అభ్యాస్'

భారత్, అమెరికా 18వ ఎడిషన్ సాయుధ దళాల సంయుక్త శిక్షణా విన్యాసాలను ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి.

ఈ విన్యాసాలు  ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలి ప్రాంతంలో, చైనా సరిహద్దులకు సమీపంలో ఇవి జరుగుతుండడంతో ప్రాధాన్యం నెలకొంది. దీన్ని యుద్ధ అభ్యాస్‌గా అభివర్ణిస్తున్నారు. సంయుక్త విన్యాసాలతో రెండు దేశాల సైనికుల మధ్య మెరుగైన సాధన, వ్యూహాలు, టెక్నిక్స్‌, విధానాలు సాధ్యపడతాయని ప్రభుత్వం  తెలిపింది. ఈ క్షేత్ర స్థాయి విన్యాసాలను ఎన్ఏఐ వార్తా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. పతంగులతో శత్రు దేశాల డ్రోన్లను ట్రాప్ చేయడాన్ని చూడొచ్చు. అలాగే ఈ విన్యాసాల్లో భాగంగా శునకాలను కూడా వినియోగిస్తున్నారని తెలిసింది.

డ్రోన్లను వేటాడే గద్దలు..

Egal Drone


శత్రువులపై పోరుకు, బాంబులను గుర్తించడానికి ఎన్నో ఏళ్లుగా డాగ్‌స్క్వాడ్ సేవలు మనం చూస్తున్నాం. ఇప్పుడు భారత సైన్యం.. పక్షుల సాయం కూడా తీసుకుంటోంది. శత్రు డ్రోన్లను కూల్చడానికి డేగలకు శిక్షణ ఇస్తోంది. చైనా సరిహద్దుల్లో భారత్‌-అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాల్లో భాగంగా న‌వంబ‌ర్ 29న ఈ డేగాస్త్రాన్ని భారత్‌ ప్రదర్శించింది.  భారత సైన్యానికి ఇది సరికొత్త ఆయుధం.

Success Story : ఎలాంటి ఒత్తిడి లేకుండా సివిల్స్ కొట్టానిలా.. నా రికార్డును నేనే..

Published date : 30 Nov 2022 03:30PM

Photo Stories