Singapore New president: సింగపూర్‌కు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన థర్మన్ షణ్ముగరత్నం
Sakshi Education
భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం(66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.
తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్‌పై ఆయన గెలుపొందారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. ఆయన ఏకంగా 70.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. తద్వారా సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయ్యింది.
China New Map: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ మావేనంటూ చైనా కొత్త మ్యాప్ విడుదల
ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం థర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు కావడం విశేషం. ఫాదర్ ఆఫ్ పాథలజీ ఇన్ సింగపూర్‌గా పేరుగాంచిన కే షణ్ముగరత్నం థర్మన్ తండ్రి.
Published date : 04 Sep 2023 10:56AM