Skip to main content

World’s most expensive cities: అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌

ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌ నిలిచాయని ‘ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌’(ఈఐయూ) తెలిపింది.
Singapore and Zurich Named World's Most Expensive Cities   Singapore and Zurich top the list of most costly cities this year
Singapore and Zurich Named World's Most Expensive Cities

 జ్యూరిచ్‌ ఆరోస్థానం నుంచి ఎగబాకి సింగపూర్‌ సరసన చేరినట్లు పేర్కొంది. గతేడాది సింగపూర్‌తోపాటు తొలిస్థానంలో నిలిచిన న్యూయార్క్‌ ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది. నిత్యావసర సరకులు, గృహోపకరణాలు, కొన్నిరకాల సేవల ధరలు పెరిగిన నేపథ్యంలోనే జ్యూరిచ్‌ ఖరీదైన నగరంగా మారిందని తెలిపింది. 

World's Cheapest Cities: ప్రపంచంలో చవక నగరాల్లో అహ్మదాబాద్, చెన్నై

ఈఐయూ నివేదిక మేరకు..అత్యంత ఖరీదైన తొలి పది నగరాల జాబితాలో ఆసియా నుంచి సింగపూర్, హాంకాంగ్‌.. ఐరోపా నుంచి జ్యూరిచ్, జెనీవా, ప్యారిస్, కోపెన్‌ హాగెన్‌.. అమెరికా నుంచి న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, శాన్‌ ఫ్రాన్సిస్కో, ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ ఉన్నాయి. ఈ సర్వేను ఇజ్రాయెల్‌ హమాస్‌–యుద్ధానికి ముందు నిర్వహించినట్లు ఈఐయూ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన ప్రపంచవ్యాప్తంగా ధరలు  సగటు 7.4 శాతం చొప్పున పెరిగినట్లు నివేదిక పేర్కొంది. 2017–21 మధ్యకాలంతో పోలిస్తే ధరలు ఇంకా ఎగువ స్థాయిలోనే ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 173 నగరాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు ఈఐయూ తెలిపింది.

Global warming: గ్లోబల్‌ వార్మింగ్ పాపం పెద్ద దేశాలదే!

Published date : 05 Dec 2023 01:59PM

Photo Stories