Skip to main content

Sanatana Dharma Day in America: అమెరికాలో సనాతన ధర్మ దినోత్సవంగా సెప్టెంబర్ 3

సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద  ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్‌లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Sanatana Dharma Day in America, September 3,Mayor of Louisville ,Indian tradition
Sanatana Dharma Day in America

సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్‌విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. 
లూయిస్‌విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్‌ అధ్యక్షుడు రిషికేశ్‌, శ్రీశ్రీ రవిశంకర్‌, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జాక్వెలిన్‌ కోల్‌మన్‌, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

China New Map Objections: చైనా నూతన మ్యాప్‌పై భారత్‌ బాటలో పలు దేశాలు

సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు..

సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. 

Singapore New president: సింగపూర్‌కు అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన థర్మన్‌ షణ్ముగరత్నం

Published date : 07 Sep 2023 11:07AM

Photo Stories