Skip to main content

Schools and Colleges Holidays : దీపావళి సెలవు ఎప్పుడంటే.? వ‌రుస‌గా రెండు రోజులు పాటు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ద‌స‌రా పండ‌గ త‌ర్వాత వ‌చ్చే పండ‌గ దీపావళి. ఈ దీపావళి పండ‌గ‌ను దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు అత్యంత ఘ‌నం జరుపుకుంటారు. ఈ పండ‌గ అంటే.. ఎక్క‌వ‌గా పిల్ల‌ల‌కు చాలా ఇష్ట‌మైన పండ‌గ‌. ఎందుకుంటే.. పిల్లలు పెద్ద‌లు.. అంద‌రు సంతోషంగా టపాకాయలు కాలుస్తూ ఈ పండుగను ఎంతో సంతోషంగా జ‌రుపుకుంటారు.
Diwali Festival Celebration, Traditional Diwali Lamps, diwali schools and colleges students holidays telugu news, Diwali Celebrations in India,
diwali schools and colleges students holidays

అయితే ఈ పండ‌గ రోజు  ఆదివారం(నవంబర్ 12వ తేదీ) రోజున వ‌చ్చింది. ఇటు స్కూల్స్, కాలేజీల విద్యార్థులతో పాటు.. ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగులు కుడా నిరాశ‌తో ఉన్నారు.

☛ November 29th,30th Holidays : న‌వంబ‌ర్ 29, 30 తేదీల్లో స్కూల్స్, కాలేజీల‌కు సెల‌వులు.. అలాగే డిసెంబర్ 3న కూడా..

శ‌నివారం లేదా సోమ‌వారం దీపావళి పండ‌గ వ‌చ్చిన‌ట్లు ఉంటే బాగుండు.. అనే ఆలోచ‌న‌లో ఉన్నారు. అయితే కొన్ని స్కూల్స్‌, కాలేజీలు సోమ‌వారం అంటే న‌వంబ‌ర్ 13వ తేదీన కూడా సెల‌వు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఒక వేళ‌ న‌వంబ‌ర్ 13వ తేదీ సోమ‌వారం కూడా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ఇస్తే.. వ‌రుసగా రెండు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. ఈ విష‌యంపై ప్ర‌భుత్వం ఇంకా స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌లేదు. పండ‌గ ద‌గ్గ‌ర ప‌డే స‌మ‌యంలో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంటుంది.

ఆ రోజునే పండ‌గ‌.. ఎందుకంటే..?

diwali festival holidays 2023 telugu news


దీపావళి పండగకు ఆశ్వయుజ  బహుళ చతుర్ధశి, అర్దరాత్రి అమావాస్య ప్రామాణికం. ఈ సారి నవంబర్‌ 12 ఆదివారం చతుర్ధశి మధ్యాహ్నం 1.53 నిమిషాల వరకు ఉంది. రాత్రి అమావాస్య కాబట్టి అదే రోజు దీపావళి. ఈ సారి దీపావళి పండుగ  నవంబర్‌ 12నే  జరుపుకోవాలని పంచాగకర్తలు  అంటున్నారు.  మొత్తంగా ఒక్కో పండగకు తిథి అనేది ఒక్కో రకంగా ప్రామాణికంగా వస్తూ వస్తోంది. దీంతో  నవంబర్‌ 12వ తేదీనే దీపావళి పండుగని వేద పండితులు స్పష్టత ఇస్తున్నారు.

➤ గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

 

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

Published date : 27 Oct 2023 10:39AM

Photo Stories