Afghanistan: ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్‌కు ఎవరు నేతృత్వం వహించారు?
అఫ్గానిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక ఆ దేశం నుంచి ఎదురవుతున్న సవాళ్లపై, భద్రతా పరిస్థితులపై చర్చించడానికి భారత్ ‘ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్’ అనే అంశంపై నవంబర్ 10న సదస్సు నిర్వహించింది. వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారుల స్థాయిలో ఢిల్లీ జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వం వహించారు. సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్‌ని ఆమోదించింది. మళ్లీ 2022 ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. పాకిస్తాన్, చైనాలను కూడా సదస్సుకు ఆహ్వానించగా... సదస్సుకు హాజరుకాలేమని ఆ దేశాలు తెలిపిన విషయం విదితమే.
డిక్లరేషన్‌లో ఏముందంటే?
- అఫ్గానిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు.
- అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ.
- సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం.
- అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు
- మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు.
- అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి.
- కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి.
- ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి.
చదవండి: భారత్ తయారీ కోవాగ్జిన్‌ను గుర్తించిన ఐరోపా దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ అఫ్గానిస్తాన్ అనే అంశంపై సదస్సు నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : భారత్
ఎక్కడ : ఢిల్లీ
ఎందుకు : అఫ్గానిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లాక ఆ దేశం నుంచి ఎదురవుతున్న సవాళ్లపై, భద్రతా పరిస్థితులపై చర్చించడానికి...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్