Skip to main content

Dark Sky Nation: డార్క్‌స్కై నేషన్‌ గా న్యూజిలాండ్‌

పర్యావరణ హితం కోసం అన్ని దేశాలూ రాత్రి కాంతులను తగ్గించాలని, జీవజాలానికి కాంతి వెసులుబాటు కల్పించాలనే ఉద్యమం క్రమంగా ఊపందుకుంటున్నది.
New Zealand to become a Dark Sky Nation

అందులో అగ్రస్థాయిలో నిలవాలని న్యూజిలాండ్‌ భావిస్తోంది. ప్రపంచంలో ప్రస్తుతం నియూ అనే చిన్న దేశం ఒక్కటే డార్క్‌స్కై కంట్రీగా గుర్తింపు పొందింది. పసిఫిక్‌లోని చిన్న ద్వీపదేశమైన నియూ జనాభా కేవలం 1600 మాత్రమే. 2020లో ఇంటర్నేషనల్‌ డార్క్‌స్కై అసోసియేషన్‌ (ఐడీఎస్‌ఏ) ఆ దేశానికి సర్టిఫికేషన్‌ మంజూరు చేసింది. ఇప్పుడు న్యూజిలాండ్‌ అదే బాటలో పయనించాలని తీర్మానించుకుంది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 18 Nov 2022 07:31PM

Photo Stories