Lightest paint: ప్రపంచంలోనే తేలికైన పెయింట్
Sakshi Education
ప్రపంచంలోనే తేలికైన పెయింట్‌ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్‌ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవచ్చని, ఇది వందల ఏళ్ల పాటు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పెయింట్ల తయారీకి భిన్నమైన రసాయనాలను వినియోగించి దీనిని తయారుచేశారు. ఈ పెయింట్‌ను తయారుచేసిన బృందానికి యూనివర్సిటీలోని నానోసైన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రొఫెసర్ దెబాశిస్ చందా నేతృత్వం వహించారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 17 Apr 2023 05:49PM