Skip to main content

Japan: ఆర్థిక మాంద్యంలోకి జపాన్

జపాన్‌ మాంద్యంలోకి జారిపోయింది.
Japan unexpectedly slips into recession

జపాన్‌ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య)లో 0.4%, జూలై– సెప్టెంబర్‌లో 2.9% మేర క్షీణించింది. అయితే 2023 మొత్తం మీద జపాన్‌ జీడీపీ 1.9% పెరిగింది. 2023 చివరి త్రైమాసికంలో జీడీపీ క్షీణతతో, ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో నాలుగో స్థానానికి జపాన్‌ దిగివచ్చింది. 2010 వరకు జపాన్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఆ సమయంలో చైనా ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. గతేడాది జపాన్‌ జీడీపీ 4.2 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగించిన సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలో ఉందనేందుకు గుర్తుగా భావిస్తారు.

దీంతోపాటు, జపాన్‌ కరెన్సీ యెన్‌ కూడా బలహీ నపడింది. ఫలితంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్‌.. అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది.

American Citizenship: 59 వేల భారతీయులకు అమెరికా పౌరసత్వం

Published date : 16 Feb 2024 04:43PM

Photo Stories