Skip to main content

Worlds Biggest Temple: అతిపెద్ద వేదిక్‌ ప్లానిటోరియం టెంపుల్‌ని నిర్మిస్తున్న ఇస్కాన్

ఇస్కాన్‌ సంస్థ పశ్చిమబెంగాల్‌లోని మాయాపూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వేదిక్‌ ప్లానిటోరియం టెంపుల్‌ నిర్మిస్తోంది.
ISKCON is building the Worlds Biggest Temple
ISKCON is building the Worlds Biggest Temple

 ఈ ఆలయ ఫొటోలను ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ కృష్ణ కాన్షియస్‌నెస్‌ (ఇస్కాన్‌) సంస్థ నిర్వాహకులు ఇటీవలే ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 2010లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు విలువ వంద మిలియన్‌ డాలర్లట. విశ్వంలోని వివిధ గ్రహాల కదలికలకు ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారట. వేదాల ప్రకారం విశ్వం గురించి, ఇతర పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశంలోని ఐకానిక్‌ భవనాల జాబితాలో చేరనున్న ఈ ఆలయం.. వాటికన్‌లోని సెయింట్‌పాల్‌ కేథడ్రల్‌ కంటే, ఆగ్రాలోని తాజ్‌మహల్‌ కంటే పెద్దది. ఆలయ డోమ్‌ సైతం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇకనుంచి ఇస్కాన్‌ సంస్థ ప్రధాన కేంద్రంగా పనిచేయనున్నది. అంతేకాదు ఒకేసారి 10వేల మంది భక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉందట. 

Also read: Quiz of The Day (September 02, 2022): భారతదేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?

ఈ ఆలయ నిర్మాణ వ్యవహారాలన్ని వ్యాపార దిగ్గజం హెన్రీఫోర్డ్‌ మనవడైన ఆ్రల్ఫెడ్‌ ఫోర్డ్‌ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అంబరీష్‌ దాస్‌గా పేరు మార్చుకున్న ఆయన ఇస్కాన్‌ భక్తుడు. 2024 నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 2022నాటికే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యమయిందని ఇస్కాన్‌ నిర్వాహకులు తెలిపారు. 

Also read: Artemis-1 Mission : ఆర్టెమిస్‌ 1 నిలిపివేసిన నాసా.. కార‌ణం ఇదే..

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Sep 2022 05:58PM

Photo Stories