Skip to main content

Arunachal Frontier Highway Project-అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్‌, చైనాకు ఎందుకంత భయం?

Arunachal Frontier Highway  Strengthening India's security measures in the face of challenges.  Interesting things to know about Arunachal Frontier Highway Project

భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా అనునిత్యం చొరబాటు ప్రయత్నాలను చేస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలోనే అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులను భారత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విశేషాలు..

అప్పటిలోగా ప్రాజెక్ట్‌ పూర్తి

అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే ప్రాజెక్ట్ పూర్తయితే సరిహద్దు ప్రాంతాలకు సైన్యం చేరుకోవడం మరింత సులభతరం కానుంది. అప్పుడు సైన్యం ఎల్‌ఏసీకి చేరుకోవడానికి అధిక సమయం పట్టదు. 1748 కి.మీ పొడవైన నేషనల్‌ హైవే-913ని పూర్తి చేయడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టనుంది. ఈ ప్రాజెక్ట్ 2027 నాటికి పూర్తికానుంది.

చైనా తీవ్ర అభ్యంతరం
ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోని అన్ని గ్రామాలను ఆల్-వెదర్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2016లో భారత్‌ ఈ ప్రాజెక్ట్  గురించి ప్రకటించిన తర్వాత చైనా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయినా లెక్కచేయని భారత్‌
ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే వరకు భారత్ ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించకూడదని చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే చైనా అభ్యంతరాన్ని భారత్ పట్టించుకోలేదు.ఈ ప్రాజెక్టులో భాగంగా హున్లీ- హ్యూలియాంగ్ మధ్య దాదాపు 121 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మించనున్నారు. అదే సమయంలో హున్లీ- ఇతున్ మధ్య 17 కిలోమీటర్ల పొడవైన వ్యూహాత్మక వంతెన, టుటిన్ నుండి జిడో వరకు 13 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మిస్తున్నారు.

అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగర్‌లో ముగుస్తుంది. ఈ హైవే సిద్ధమైన తర్వాత తవాంగ్ సమీపంలోని బోమ్డిలా నుండి మయన్మార్ సరిహద్దు సమీపంలోని విజయనగరానికి అనుసంధానం ఏర్పడుతుంది.

సరిహద్దులకు దగ్గరగా..

అన్ని వాతావరణాల్లోనూ ఉపయుక్తమయ్యేలా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాలకు ఈ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. ఈ హైవే నిర్మాణం కోసం అనేక సొరంగాలు కూడా నిర్మించనున్నారు. ఈ హైవే భూటాన్ సరిహద్దు సమీపంలోని తవాంగ్ నుంచి ప్రారంభమై, భారత్-మయన్మార్ సరిహద్దులోని విజయనగర్ వద్ద ముగుస్తుంది. ఈ రహదారి భారతదేశం-టిబెట్-చైనా, మయన్మార్ సరిహద్దులకు దగ్గరగా వెళుతుంది.

Published date : 08 Jan 2024 08:45AM

Photo Stories