Skip to main content

COP26: భారత్‌ ప్రారంభించిన ఐరిస్‌ కార్యక్రమ ఉద్దేశం?

IRIS

వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ రెసిలియెంట్‌ ఐలాండ్‌ స్టేట్స్‌ (ఐఆర్‌ఐఎస్‌–ఐరిస్‌) అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత్‌ శ్రీకారం చుట్టింది. కాప్‌26 వాతావరణ సదస్సు సందర్భంగా గ్లాస్గోలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలు ఇప్పటికే తీసుకువచ్చిన కొయిలేషన్‌ ఫర్‌ డిజాస్టర్‌ రెసిలెయింట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (సీడీఆర్‌ఐ)లో భాగంగానే తాము కూడా పని చేస్తామని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమానికి బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తోపాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లు హాజరయ్యారు.

ఏమిటీ ఐరిస్‌?

సీడీఆర్‌ఐ భాగంగా ఐరిస్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని కింద చిన్న ద్వీప దేశాల్లో వాతావరణ మార్పుల వల్ల క్షేత్ర స్థాయిలో తలెత్తే ముప్పులపై మదింపు వేస్తారు. వీటిని తట్టుకునే మౌలిక వసతుల నిర్మాణం, సామర్థ్య పెంపునకు ఆర్థిక వనరుల సమీకరణకు తోడ్పాటు అందిస్తారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేపడతారు. భారత్, బ్రిటన్, ఆస్ట్రేలియాల మధ్య సహకారం వల్ల ఇది సాధ్యమైంది.
 

ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్‌ అనే పిలుపునిచ్చిన దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ రెసిలియెంట్‌ ఐలాండ్‌ స్టేట్స్‌ (ఐఆర్‌ఐఎస్‌–ఐరిస్‌) కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్‌ 2
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గ్లాస్గో, స్కాట్‌లాండ్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌
ఎందుకు : వాతావరణ మార్పులను తట్టుకునేలా చిన్న చిన్న ద్వీపసమూహాల్లాంటి దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Nov 2021 05:33PM

Photo Stories