Parliament Building: ఏ దేశ పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది?
కేప్‌టౌన్‌లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్ భవన సముదాయంలో జనవరి 2న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయా లేదా విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమని పార్లమెంట్ స్పీకర్ నొసివివే అన్నారు. సంఘటన ప్రాంతాన్ని అధ్యక్షుడు సిరిల్ రమఫోసా సందర్శించారు. మంటలు మొదట ప్రారంభమైన పార్లమెంట్ పాత భవనం 1880ల నాటిది కాగా, దాని వెనుక ఉన్న నేషనల్ అసెంబ్లీ భవనం ఇటీవలి కాలంలో నిర్మించింది. కాగా, దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. కేప్‌టౌన్ నగరం లెజిస్లేటివ్ రాజధాని కాగా, ప్రిటోరియా పరిపాలన కేంద్రంగా, బ్లోమ్ ఫోంటెన్ న్యాయ రాజధానిగాను ఉన్నాయి.
2022 ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థ?
మామాఎర్త్ తదితర బ్రాండ్స్ పేరిట వ్యక్తిగత సౌందర్య సంరక్షణ సాధనాలు విక్రయించే ఈ–కామర్స్ సంస్థ హోనాసా కన్జూమర్ తాజాగా 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 52 మిలియన్ డాలర్లు సమీకరించింది. తద్వారా 2022 ఏడాది యూనికార్న్ హోదా దక్కించుకున్న తొలి సంస్థగా నిలిచింది.
టై హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా సురేశ్ రాజు..
ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ విభాగం కొత్త ప్రెసిడెంట్‌గా (2022కి) సురేశ్ రాజు నియమితులయ్యారు. ఆయన నియామకం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లవుతుందని టై హైదరాబాద్ తెలిపింది. రాజు ఇప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.
టెస్లా ఆటోపైలట్ టీమ్ తొలి ఉద్యోగి మనోడే..
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లాకి చెందిన ఆటోపైలట్ టీమ్‌లో తొలి ఉద్యోగిగా భారత సంతతికి చెందిన వ్యక్తి అశోక్ ఎల్లు స్వామి నియమితులయ్యాడు. ఈ విభాగంలో నియామకాలకు సంబంధించి తొలుత అశోక్‌ను రిక్రూట్ చేసుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ వెల్లడించారు.
చదవండి: జే–10సీ జెట్ విమానాలను కొనుగోలు చేసిన దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్