Fighter Jets: జే–10సీ జెట్ విమానాలను కొనుగోలు చేసిన దేశం?
చైనా తయారీ జే–10సీ జెట్ విమానాల ఫుల్ స్క్వాడ్రన్ (25 విమానాలు)ను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. భారత్ ఇటీవల జరిపిన రఫేల్ విమానాల కొనుగోలుకు బదులుగా చైనా జెట్లను కొన్నామని డిసెంబర్ 30న పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. అన్ని రకాల వాతావరణాల్లో ప్రయాణం చేయగల ఈ జెట్ విమానాలు 2022, మార్చి 23న పాకిస్తాన్ డే రోజున కవాతులో పాల్గొంటాయని చెప్పారు. గతంలో పాక్, చైనా సంయుక్త విన్యాసాల్లో ఈ జెట్లు పాల్గొన్నాయి.
సుమారు 3.5 కోట్ల డాలర్లు..
ప్రస్తుతం పాక్ వద్ద యూఎస్ తయారీ ఎఫ్–16 విమానాలున్నాయి. ఇవి రఫేల్‌కు దీటు రాగలవని నిపుణుల అంచనా. అయితే వీటికన్నా మరింత మెరుగైన జెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో పాక్ తాజాగా చైనా జెట్లను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు ఒక్కోటి సుమారు 3.5 కోట్ల డాలర్లు.
చదవండి: భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు ఎక్కడ జరిగింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : చైనా తయారీ జే–10సీ జెట్ విమానాల ఫుల్ స్క్వాడ్రన్ (25 విమానాలు) కొనుగోలు
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : పాకిస్తాన్త
ఎందుకు : భారత్ ఇటీవల జరిపిన రఫేల్ విమానాల కొనుగోలుకు బదులుగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్