Afghanistan: భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు ఎక్కడ జరిగింది?
భారత రాజధాని నగరం న్యూఢిల్లీలో మూడో భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు జరిగింది. డిసెంబర్ 18, 19వ తేదీల్లో జరిగిన ఈ సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు కజఖ్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. అఫ్గనిస్తాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించి, అక్కడి ప్రజలకు తక్షణ మానవతాసాయం అందించాలని సదస్సులో తీర్మానించారు. అఫ్గాన్ గడ్డ ఉగ్రవాదులకు శిక్షణ, సాయం, ఆశ్రయాలకు అడ్డాగా మారనివ్వరాదని నిర్ణయించారు. ప్రాంతీయ అనుసంధానతకు చేపట్టే ప్రాజెక్టులు పారదర్శకతతో, విస్తృత భాగస్వామ్యం, స్థానిక ప్రాధాన్యతలు, ఆర్థి కస్థిరత్వం ప్రాతిపదికగా ఆయా దేశాల సార్వభౌమత్వానికి భంగం కలుగని రీతిలో ఉండాలని అనంతరం వారు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సెంట్రల్ ఆసియా దేశాలతో సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని మంత్రి జై శంకర్ చెప్పారు.
చదవండి: ఏ దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మూడో భారత్–సెంట్రల్ ఆసియా సదస్సు నిర్వహణ
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : భారత్ – కజఖ్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రులు
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అఫ్గనిస్తాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్