Ram Nath Kovind: ఏ దేశ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు?
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 15న ఢాకా చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో సతీసమేతంగా తొలిసారిగా వచ్చిన ఆయనకు బంగ్లాదేశ్ త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. బంగ్లా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్దుల్ హమీద్ సతీసమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్‌కు ఆహ్వానం పలికారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లా విముక్తి పొందింది. బంగ్లా విముక్తి యుద్ధంలో అసువులు బాసిన వీరులకు కోవింద్ నివాళులర్పించారు. అనంతరం బంగబంధు, బంగ్లాదేశ్ జాతిపిత, దివంగత షేక్ ముజీబుర్ రెహ్మాన్ మ్యూజియంను సందర్శించారు. కరోనా విజృంభణ తర్వాత కోవింద్ విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో రాష్ట్రపతి కోవింద్ చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సహా పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు.
చదవండి: 21వ భారత్–రష్యా శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎందుకు : బంగ్లాదేశ్ స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్